Pakistan: పాకిస్తాన్‌కు యుద్ధం చేతకాదు, భారత్‌తో ప్రతీసారి ఓడిపోతున్నప్పటికీ తన ప్రజల్ని బకరాలను చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తోంది. పాక్ ప్రజలే కాదు, భారత్‌లోని కొందరు వ్యక్తులు కూడా పాక్ అబద్ధాలకు వంతపాడుతున్నారు. మరోసారి, పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాక్‌లోని 11 ఎయిర్‌బేసులు దారుణంగా ధ్వంసమయ్యాయి. అయినా కూడా, తామే భారత్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్‌పై ధ్వంసం చేశామని పాక్ చెప్పుకుంటోంది. పాక్ అనుకూల సోషల్ మీడియా హ్యాండ్లర్లు ఈ అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. పాక్‌కు చెందిన మీడియం రేంజ్ క్షిపణి ఫతా దాడులు చేసినట్లుగా దాయాది దేశం చెప్పుకుంటోంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. నిప్పంటించిన మతోన్మాదులు..
భారత్‌తో ఘర్షణ సమయంలో పాకిస్తాన్ అమృత్‌సర్ వైమానిక స్థావరం,బియాస్‌లోని బ్రహ్మోస్ ఫెసిలిటీపై దాడులు చేశామని, దాడికి ముందు, తర్వాత అంటూ కొన్ని ఫోటోలను ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఇవన్ని అబద్ధాలని వెంటనే తేలింది. ప్రముఖ ఉపగ్రహ చిత్రాల నిపుణులు ఈ ఫోటోలు నిర్మాణాలకు ముందు, నిర్మాణం తర్వాతవిగా తేల్చి చెప్పారు. ఆ ప్రదేశాలలో అలాంటి “విధ్వంసం” కనిపించలేదని జియో-ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఎత్తి చూపారు. వాస్తవానికి, నిర్మాణానికి ముందు నాటి చిత్రాలని చెప్పారు. వాటినే పాకిస్తాన్ చూపుతూ దాడులు చేశామని చెబుతోందని అన్నారు.
