Site icon NTV Telugu

Pakistani YouTuber: ‘‘వారిని సె*క్స్ బానిసలుగా చేయాలనుకుంటున్నా’’ పాక్ యూట్యూబర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

Pak

Pak

Pakistani YouTuber: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేలా పాకిస్తానీ జర్నలిస్ట్, యూట్యూబర్ వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారతీయ నటీమణుల’’ను సెక్స్ బానిసలుగా చేసుకోవాలని అనుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. ఈ వైరల్ వీడియోపై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ జర్నలిస్ట్ ‘‘రాడికల్ మనస్తత్వాన్ని’’ ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

Read Also: Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ కాలేదు, సన్‌సెట్ అయింది.. అంతా అస్సాం బ్యాచే!

పాకిస్తాన్ జర్నలిస్ట్ నయీమ్ హనీఫ్, మరో జర్నలిస్ట్ మబాషిర్ లుక్మాన్‌తో నిర్వించిన ఒక పాడ్‌కాస్ట్‌లో.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే మీరు ఏం కోరుకుంటారు అని లుక్మాన్‌ని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా మబాషిర్ లుక్మాన్ మాట్లాడుతూ.. ‘‘ మీ పాడ్‌కాస్ట్ ద్వారా నేను ముస్లిం పండితులను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భారతీయ నటీమణులను మన సెక్స్ బానిసలుగా చేస్తే మాకు అనుమతి ఉంటుందా.? లేదా..?’’ అని కామెంట్స్ చేశాడు.

పాకిస్తాన్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘‘ ఇది కేవలం చర్చ కాదు, ఇది పాకిస్తాన్ రాడికల్ మనస్తత్వం. స్త్రీద్వేషం, వక్రబుద్ధి, అనాగరిక కల్పనలు జాతీయవాదానికి సంకేతాలు కావు. అవి వ్యాధిగ్రస్త మనస్తత్వ లక్షణాలు, బాలీవుడు ఇప్పుడు మౌనంగా ఉంటే, అది కుట్రపూరితమైంది’’ అని రాశారు.

Exit mobile version