Pak Minister: ఆర్టికల్ 370పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందన్నారు. తాజాగా ఓ మీడియా చానల్‌కు పాక్ మినిస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A పునరుద్దరించే విషయంలో పాకిస్థాన్, కాంగ్రెస్-ఎన్సీ కూటమి ఓకే వైఖరితో ఉన్నాయని వెల్లడించారు.
Read Also: Viral Video : వాడికి లేదు.. నీకన్నా సిగ్గుండాలి కదా.. రోడ్డు మీద బైక్ పై ఆ రొమాన్స్ ఏంటి ?
కాగా, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే నిలుస్తుందని ఆరోపించింది. ‘పాకిస్థాన్ ఒక ఉగ్రదేశం.. కశ్మీర్‌పై కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని సమర్థిస్తుంది అని పేర్కొనింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుంచి పాక్ వరకు భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు రాహుల్, కాంగ్రెస్ నిలుస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా విమర్శించారు. కాగా, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ హామీ ఇచ్చింది.. కానీ, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉండిపోయింది. అయితే, కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పలుమార్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి అసిఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Pakistan, a terrorist state, endorses Congress and National Conference’s position on Kashmir.
Pakistan’s Defence Minister Khawaja Asif, on Hamid Mir’s Capital Talk on Geo News says, “Pakistan and National Conference-Congress alliance are on the same page in Jammu & Kashmir to… pic.twitter.com/In8SOJKHBZ
— Amit Malviya (@amitmalviya) September 19, 2024