Pakistan: భారత సైన్యం సర్‌క్రీక్ సరిహద్దు ప్రాంతంలో త్రివిధ దళాల ‘‘త్రిశూల్’’ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ప్రాంతంలో భారత్ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే, త్రిశూల్ విన్యాసాల కోసం, వైమానిక స్థలాన్ని భారత్ రిజర్వ్ చేసుకున్న ప్రాంతంలోనే, పాకిస్తాన్ తన ఫైరింగ్ ఎక్సర్‌సైజ్ కోసం శనివారం నేవీ నావిగేషన్ హెచ్చరికల్ని జారీ చేసింది. దీనిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) విశ్లేషకుడు డామియన్ సైమన్ నివేదించారు.
అక్టోబర్ 28-29 వరకు మధ్య, దక్షిణ పాకిస్తాన్ అంతటా వైమానిక మార్గాలను పరిమితం చేస్తూ, ఇస్లామాబాద్ నోటమ్ (నోటీసు టు ఎయిర్‌మెన్ (NOTAM)) జారీ చేసింది. కారణాలు చెప్పనప్పటికీ, పాకిస్తాన్ సైనిక విన్యాసాలు లేదా ఆయుధ పరీక్షలు నిర్వహిస్తుందని అంతా భావించారు. ఇదే సమయంలో భారత్ నిర్వహిస్తున్న భారీ యుద్ధ విన్యాసాల కారణంగా పాకిస్తాన్ ఈ చర్య తీసుకుందని అంతా అనుకున్నారు.
Read Also: Pakistan: భారత్ మాపై రెండు వైపులా యుద్ధం చేస్తోంది.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు భారత్ త్రిశూల్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తోంది. దేశంలో ఇటీవల సంవత్సరాల్లో అత్యంత ముఖ్యమైన ఉమ్మడి సైనిక కార్యకలాపాలుగా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని అభివర్ణించింది. పాక్ సరిహద్దు వెంబడి సర్‌క్రీక్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ నేవీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
సైమన్ పంచుకున్న ఉపగ్రహ చిత్రాల్లో, భారత్ ఈ వార్ ఎక్సర్‌సైజ్ కోసం 28,000 అడుగుల వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసినట్లు సూచించారు. గుజరాత్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి ఈ ప్రాంతం విస్తరించి ఉంది. భారత్ రిజర్వ్ చేసుకున్న ప్రాంతంలోని, కొంత స్థలంలో పాక్ నేవీ నావిగేషన్ వార్నింగ్ జారీ చేసింది. భారత్ నిర్వహిస్తున్న ఈ విన్యాసాలను పాకిస్తాన్ నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల తర్వాత నుంచి ఒకింత భయంతో ఉంది. పలు సందర్భాల్లో సైనిక అధికారులు, రక్షణ మంత్రి మాట్లాడుతూ.. పాక్ తోక జాడిస్తే ‘‘ఆపరేషన్ సిందూర్ 2.0’’ జరుగుతుందని హెచ్చరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంతో పాకిస్తాన్ తన నేవీ కార్యకలాపాలను పెంచింది. దీంతో, ఈసారి పాక్ ఏదైనా చర్యకు దిగితే దాని హిస్టరీ, భౌగోళిక స్వరూపం పూర్తిగా మారుతుందని భారత్ హెచ్చరికలు జారీ చేసింది.
