Site icon NTV Telugu

కాశ్మీర్లో ముగ్గురు పాక్ స్మగ్లర్లు హతం.. భారీగా మత్తు పదార్ధాలు సీజ్

జమ్ముకశ్మీర్​లోని సాంబా సరిహద్దులో పాకిస్థాన్ చొరబాటు దారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న ముగ్గురు పాక్​ స్మగ్లర్లను బీఎస్​ఎఫ్​ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతాధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లు చొరబడుతుండగా భద్రతా దళాలు వారిని హతమార్చాయి. హతులు ముగ్గురినించి 36 ప్యాకెట్ల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం బీఎస్​ఎఫ్​ గుర్తించిందని డీఐజీ సంధు వెల్లడించారు.

లొంగిపోవాలని వారిని కోరినా పట్టించుకోకపోవడంతో బలగాలు కాల్పులు జరిపాయి. వారు రవాణా చేస్తున్న హెరాయిన్ సీజ్ చేశారు. వారినుంచి మొత్తం 36 కిలోల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను నిరోధించేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశాయి బలగాలు.

Exit mobile version