NTV Telugu Site icon

Simla Agreement: “పాకిస్తాన్ జెండా మిస్సింగ్”.. ‘‘సిమ్లా ఒప్పందం’’ టేబుల్‌పై కనిపించని జెండా..

Simla Agreement

Simla Agreement

Simla Agreement: పహల్గామ్ ఉగ్రదాడి, ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ -పాక్ మధ్య 1972లో ‘‘సిమ్లా ఒప్పందం’’ జరిగిన చారిత్రాత్మక టేబుల్‌పై ‘‘పాకిస్తాన్ జెండా’’ కనిపించకుండా పోయింది. భారత్, పాక్‌తో సంబంధాలను నిలిపేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం జరిగింది. మంగళవారం, పహల్గామ్‌లో 26 మంది అమాయకపు టూరిస్టులను లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కిరాతకంగా చంపేసింది.

Read Also: Kerala: పహల్గామ్ దాడిపై రెచ్చగొట్టే పోస్ట్ చేసిన “ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్” నేత..

ఇప్పటికే, భారత్ పాక్‌పై దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దుతో పాటు పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’తో పాటు భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసింది. పాక్ నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత ‘‘పాకిస్తాన్ జెండా’’ విషయం వెలుగులోకి వచ్చింది.

1973లో సిమ్లాలోని రాజ్‌భవన్‌లోని ఈ టేబుల్ మీద భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టోలు సంతకాలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌లోని కీర్తి హాల్‌లో ఈ టేటుల్‌పై సిమ్లా ఒప్పందానికి సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఆ టేబుల్ పైన ఉన్న పాకిస్తాన్ జెండా శుక్రవారం నుంచి కనిపించకుండా పోయినట్లు నేషనల్ మీడియా నివేదించింది.