Site icon NTV Telugu

Hafiz Saeed: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. హఫీజ్ సయీద్‌కి పాక్ ఆర్మీతో నాలుగంచెల భద్రత..

Hadex Saeed

Hadex Saeed

Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ అయిన హఫీస్ సయీద్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం విస్తృత భద్రతను కల్పించింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతను మరించి పెంచింది. 26 మందిని టూరిస్టులు మరణించడానికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కారణం. దీంతో, భారత్ పాకిస్తాన్‌తో పాటు ఈ కుట్రకు పాల్పడిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను విడిచిపెట్టమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని సయీద్ ఇంటి చుట్టూ ఇప్పుడు నిఘాను పెంచింది.

Read Also: Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న ర‌కుల్ భ‌ర్త

పాకిస్తాన్ సాయుధ దళాలు 24 గంటల పాటు సయీద్‌ని రక్షిస్తున్నాయి. లాహోర్‌లోని బిజీ ఏరియాగా పేరున్న మొహల్ల జోహార్ టౌన్‌లో హఫీస్ హై సెక్యూరిటీ కలిగిన ఇంటిలో ఉంటున్నాడు. ఏప్రిల్ 22 తర్వాత సయీద్‌కి భద్రతను పెంచారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు సంయుక్తంగా అతడి రక్షణను పర్యవేక్షిస్తున్నారు. ఇతడి ఇంటిని పర్యవేక్షించడానికి డ్రోన్లను మోహరించడంతో పాటు 4 కి.మీ వ్యాసార్థంలో ఉన్న అన్ని రోడ్లలో హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

Exit mobile version