Site icon NTV Telugu

Padmanabhaswamy Temple: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘‘మహా కుంభాభిషేకమ్’’..

Padmanabhaswamy Temple

Padmanabhaswamy Temple

Padmanabhaswamy Temple: కేరళలో రాజధాని తిరువనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ‘‘మహా కుంభాభిషేకం’’ జరిగింది. దీంతో ఆదివారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ పురాతన ఆలయంలో ఇటీవల దీర్ఘకాలిక పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్టించారు. ఆ తర్వాత విశ్వక్సేనుడి విగ్రహాన్ని పున:ప్రతిష్టించారు. ఈ విగ్రహం దాదాపుగా 300 ఏళ్ల క్రితం నాటిది. ‘కటు సర్కార యోగం’ విధానంలో దీనిని తయారు చేశారు. ప్రధాన ఆలయ ఆవరణలోని తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ప్రతిష్టించారు.

Read Also: Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు

ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ యొక్క ప్రస్తుత అధిపతి మూలం తిరునల్ రామ వర్మ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేసిన తరువాత ఆచారాలు ప్రారంభమయ్యాయి. రాజకుటుంబీల సమక్షంలో ప్రధాన పూజారి మొదటి తిరువాంబాడి ఆలయంలో ‘‘అష్టాబాంధ కలసం’’ చేపట్టారు. కేరళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ పుణ్యక్షేత్రానికి హాజరయ్యారు. 2017 లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల ప్యానెల్ యొక్క ఆదేశాల మేరకు పునర్నిర్మాణం జరిగింది. అయితే, కోవిడ్ కారణంగా పనులు నెమ్మదించాయి. 2021 తర్వాత వివిధ దశల్లో పనులను పూర్తి చేశారు. ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడం, ఆలయ పరిసరాలను మరింత పవిత్రం చేయడమే ఈ మహాకుంభాభిషేకం లక్ష్యమని ఆలయ అధికారులు తెలిపారు.

Exit mobile version