గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.
పద్మశ్రీ అవార్డు అందుకున్న వారి లిస్ట్
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)
హర్విందర్ సింగ్
భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)
పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),
ఎల్.హంగ్‌థింగ్ (నాగాలాండ్),
అల్ సబా (కువైట్)
బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్),
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (కువైట్),
నరేన్ గురుంగ్ (నేపాల్),
మారుతీ భుజంగరావు మరాఠీ రచయిత
హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్),
జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్),
విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర),
వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక).
జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
డాక్టర్ నీర్జా భట్ల (ఢిల్లీ)
లిబియా లోబో సర్దేశాయ్ (గోవా)
గోకుల్ చంద్ర దాస్(పశ్చిమ బెంగాల్)