Site icon NTV Telugu

Oxygen cylinder car caught fire: తప్పిన ప్రమాదం.. ఆక్సిజన్‌ సిలిండర్‌లను తరలిస్తున్న కారులో భారీ పేలుడు..

Oxygen Cylinder Car Caught Fire

Oxygen Cylinder Car Caught Fire

oxygen cylinder car caught fire: ఆక్సిజన్‌ సిలిండర్‌లను తరలిస్తున్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. కండ్‌గావ్ సమీపంలోని చొండి ఘాట్ సమీపంలోని మాలేగావ్ రోడ్‌లో, కార్గో ట్రక్కులోని ఎల్‌పిజి సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో కార్గో ట్రక్కులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారులో నుంచి కిందికి దూకేసి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. దీంతో ఈ జాతీయ రహదారిపై వెంటనే రాకపోకలు నిలిచిపోయాయి. మన్మాడ్ నుంచి మాలేగావ్ వెళ్లే వాహనాలు మన్మాడ్-చంద్వాడ్-మాలేగావ్ మార్గంలో వెళ్లాలి. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్‌కు ఎలా మంటలు అంటుకున్నారనే సమాచారం అందలేదు. అయితే కదులుతున్న సరుకు రవాణా కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో సిలిండర్లు గాలిలోకి ఎగిరిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు ట్రాఫిక్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ను విచారిస్తున్నారు.

South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్

Exit mobile version