Asaduddin Owaisi: బీహార్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో, ఎంఐఎం పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇండియా కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మమ్మీ, మమ్మీ వాళ్లు మన చాక్లెట్ దొంగిలిచారు అని ఎన్నికల తర్వాత ఎవరూ ఏడవకూడదు.’’ అని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో చేరాలని భావిస్తున్నారా.?? అని ఓవైసీని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మా రాష్ట్ర చీఫ్ అఖ్తరుల్ ఇమామ్‌ని పొత్తు కోసం శాయశక్తులా ప్రయత్నించమని అడిగాను. ఎవరూ కూడా మమ్మీ, వాళ్లు మన చాక్లెట్ దొంగిలించారని ఏదవకూడదు. వారు సిద్ధంగా ఉంటే, మేము కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నాము. బీజేపీ-ఏన్డీయే కూటమి తిరిగి రావాలని నేను కోరుకోవడం లేదు. కానీ వారు అంగీకరించకపోతే, మేము ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.’’ అని ఓవైసీ చెప్పారు.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
ఎంఐఎంని తరుచుగా ప్రతిపక్షాలు బీజేపీ బీ-టీమ్‌గా అభివర్ణిస్తున్న నేపత్యంలో ఆయన ‘‘చాక్లెట్’’ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా బీజేపీ గెలిచేందుకు ఎంఐఎం సహకరించిందని ప్రతిపక్షాల ఆరోపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే వారితో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం చీఫ్ చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం నాయకులు క్రియాశీలకంగా ప్రచారం చేస్తున్నారని ఓవైసీ చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ ముఖ్యంగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను కలవరపరుస్తోంది. ముస్లిం కమ్యూనిటీలో ఎంఐఎంకి మంచి ఆదరణ ఉంది. మరోవైపు, ఆర్జేడీ కూటమి ముస్లిం-యాదవ ఓట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తే ముస్లిం ఓట్లు చీలుతాయని ఆర్జేడీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసిన 5 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.
