Site icon NTV Telugu

Train Accident: రెండు రైళ్లు ఢీ.. 50 మందికి పైగా గాయాలు

Train Accident

Train Accident

Train Accident: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు ప్యాసింజర్‌ రైలు వెళ్తోంది.

Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..

సమాచారం ప్రకారం, సిగ్నలింగ్ సమస్యల కారణంగా ఈ సంఘటన జరిగింది. డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసినా గూడ్స్‌ రైలును ఢీకొనడంతో తప్పించుకోలేకపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version