గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.. 182 సీట్లకు గాను 156 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది.. 53 శాతానికి పైగా ఓట్లను సాధించింది బీజేపీ.. అయితే, ఇదే సమయంలో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి… ఏకంగా 5,01,202 మంది ఓటర్లు.. బరిలో ఉన్న ఏ అభ్యర్థి తమకు నచ్చలేదంటూ నోటాపై నొక్కారు.. మొత్తం పోలైన ఓట్లలో నోటాకు పోలైన ఓట్లు 1.5 శాతంగా ఉన్నాయి.. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఈ ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్ల షేరింగ్ శాతం మాత్రం కాస్త తగ్గింది.. గత ఎన్నికల్లో అంటే 2017లో ఏకంగా నోటాకు 5,51,594 ఓట్లు అంటే 1.84 శాతం ఓట్లు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం.
Read Also: Cylinder Blast: పెళ్లి వేడుకల్లో అపశ్రుతి.. సిలిండర్ పేలి 5గురు మృతి, 60 మందికి గాయాలు
ఇక, నోటాకు పడిన ఓట్లలో అత్యధికంగా ఖేడ్‌బ్రహ్మ నియోజకవర్గంలో 7,331 ఓట్లు నోటాకు పడగా.. డాంటాలో 5,213 ఓట్లు, ఛోటా ఉదయ్‌పూర్‌లో 5,093, దేవ్గధ్‌బారియాలో 4,821, షెహ్రాలో 4,708, నైజర్‌లో 4,465, బర్డోలిలో 4,211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4,022 ఓట్లు నోటాకు వచ్చినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది.. బీజేపీ మరియు కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓటు షేరింగ్ నోటాకే ఉంది.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (0.62 శాతం), బహుజన్ సమాజ్ పార్టీ (0.69 శాతం) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.
