NTV Telugu Site icon

ITR filing: రికార్డ్ స్థాయిలో ఐటీ రిటర్నులు దాఖలు.. ఒక్కరోజులోనే ఎన్ని వచ్చాయంటే..!

It

It

జూలై 26 వరకు 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. 2024-25 కోసం జూలై 26 వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Average Student Nani: రొమాంటిక్గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్

మైలురాయిని చేరుకోవడంలో సహాయం చేసినందుకు పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 66 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని CBDT చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

ఇది కూడా చదవండి: Memory: జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని నియమాలు..తప్పక పాటించండి..

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Payal Radhakrishna: హే పాయల్ పాపా నువ్ కూడా ఇలా జాకెట్ లేకుండా ఫోజులిస్తే ఎలా?