Site icon NTV Telugu

Maharashtra: హిందీ ‘విధింపు’పై వ్యతిరేకత.. కీలక నిర్ణయం తీసుకున్న మహరాష్ట్ర సర్కార్..

Devendra Fadnavis

Devendra Fadnavis

Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా ప్రవేశపెట్టాలనే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ వంటి పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించింది. మరాఠీ మాట్లాడే ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ వ్యతిరేకతను వినిపించాలని విజ్ఞప్తి చేసింది.

Read Also: Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్‌కతాలో ల్యాండింగ్..

దీంతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. త్రిభాషా విధానం, దాని అమలుపై డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక తర్వాత త్రిభాషా విధానం అమలు చేయబడుతుందని సీఎం వెల్లడించారు. తమకు మరాఠీ కేంద్ర బిందువు అని జోడించారు.

మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్‌లో GR జారీ చేసిన తర్వాత మరాఠీ మరియు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల వరకు హిందీ తప్పనిసరిగా మూడో భాషగా ఉంటుందని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020ని అమలు చేయాలనే చర్యల్లో భాగంగా హిందీని మూడో భాషగా చేశారు. దీనిపై నిరసన వ్యక్తం అయింది. దీంతో ఫడ్నవీస్ సర్కార్ ఈ ఒత్తిడికి తలొగ్గి హిందీ తప్పనిసరి కాదని, విద్యార్థులు మరే ఇతర ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చని అన్నారు.

Exit mobile version