Operation Sindoor Live Updates: సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో.. భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది. నూర్‌ఖాన్, మురీద్, రఫీఖీ వైమానిక స్థావరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. భారత్ ప్రతి దాడులకు పాకిస్తాన్ విలవిలలాడుతుంది. చూస్తునే ఉండండి ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్..
-
కాల్పుల విరమణకు అంగీకరించాం:
తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
-
కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్-పాక్:
భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్తాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి: ట్రంప్
-
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు:
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పోస్ట్
-
మురళీ నాయక్ అంత్యక్రియలకు పవన్ కళ్యాణ్:
దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంతో పాటు హాజరుకానున్న మంత్రులు లోకేష్, అనిత, అనగాని సత్యప్రసాద్.. మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-
అమాయక ప్రజలపై పాకిస్తాన్ కాల్పులు:
సరిహద్దుల్లో అమాయక ప్రజలపై పాకిస్తాన్ కాల్పులు.. దాడికి యత్నించిన పాక్ డ్రోన్‌లను కూల్చేసిన భారత ఆర్మీ.. పాక్ ఎయిర్‌బేస్‌లపై ప్రతీకార దాడులతో విరుచుకుపడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ఎప్పటికప్పుడు పాక్ దాడులను తిప్పికొడుతున్న భారత బలగాలు.. సరిహద్దులకు భారీగా తరలివెళ్తున్న భద్రతా బలగాలు
-
సరిహద్దుల్లో అప్రమత్తంగా భారత సైన్యం:
పంజాబ్ అటారీ-వాఘా సరిహద్దుల్లో అప్రమత్తంగా భారత సైన్యం.. పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ డ్రోన్‌లను కూల్చేసిన భారత ఆర్మీ.. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్న భారత్ బలగాలు
-
సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం:
సాయంత్రం ఆరు గంటలకు రక్షణశాఖ, విదేశాంగశాఖ సంయుక్త మీడియా సమావేశం
-
పోక్రాన్ టార్గెట్‌గా క్షిపణితో దాడి:
జైసల్మేర్: పోక్రాన్ టార్గెట్‌గా పాకిస్తాన్ క్షిపణితో దాడి.. క్షిపణిని గుర్తించి నేలకూల్చిన భారత్ ఆర్మీ.. బాలిస్టిక్ క్షిపణితో దాడికి ప్రయత్నించిన పాక్
-
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు మురళీ నాయక్ మృతదేహం:
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం.. సాయంత్రంకు గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకోనున్న మురళీ నాయక్ పార్థీవదేహం.. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన మంత్రి సవిత.. బెంగుళూరు నుంచి ఆర్మీ వాహనంలో బయలుదేరిన మురళీ నాయక్ పార్థీవదేహం
-
జైసల్మేర్ ప్రాంతంలో రెడ్ అలర్ట్:
జైసల్మేర్ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ.. జైసల్మేర్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలు నిలిపివేత
-
కీలక నిర్ణయం తీసుకున్న భారత్:
కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. ఇక నుంచి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయం.. తీవ్రవాద చర్యలను సహించేది లేదు.. పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలి.. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలి: ప్రధాని మోడీ
-
మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ:
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ.. పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను వాడొద్దని సూచన.. మాక్ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని అడ్వైజరీ.. తరచుగా సైరన్ శబ్దాలు వినియోగించడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయన్న కేంద్రం
-
కాల్పులు తీవ్రతరం చేసిన పాకిస్తాన్:
జమ్మూకశ్మీర్, నౌషోరిలో కాల్పులు తీవ్రతరం చేసిన పాకిస్తాన్.. ఎల్‌వోసీ వద్ద కాల్పులు కొనసాగిస్తున్న పాక్.. పాకిస్తాన్ దళాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్న భారత ఆర్మీ
-
రూ.10 లక్షల చొప్పున పరిహారం:
పాక్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు పరిహారం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. పాక్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు మృతి
-
చార్‌దామ్ యాత్ర సాఫీగా సాగుతోంది:
చార్‌దామ్ యాత్ర సాఫీగా సాగుతోంది.. ప్రజలు ఎలాంటి రూమర్లను నమ్మవద్దు.. ఇప్పటివరకు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారు.. కేదార్‌నాథ్ యాత్రకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాం.. ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నంబర్ 1364 లేదా 0135-1364: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
-
39 చోట్ల మెరుపు దాడులు:
గత రెండు రోజులుగా పాక్ సైన్యంపై దాడులు చేస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. 39 చోట్ల మెరుపు దాడులు.. ఓ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలోచ్ రెబల్స్
-
పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు:
అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు.. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి.. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది... పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు.. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుంది.. అమాయకులను, చిన్న పిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి: అసదుద్దీన్ ఒవైసీ
-
పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోంది:
ప్రతి విషయంలోనూ పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోంది.. అఫ్గానిస్థాన్ లక్ష్యంగా మేం దాడులు చేయలేదు.. గతేడాదిన్నర నుంచి తమపై దాడులు ఎవరు చేస్తున్నారనేది అఫ్గాన్ పౌరులకు మేం ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
-
కీలక ఉగ్రవాదులు హతం..
భారత్ దాడుల్లో మే 7వ తేదీన కీలక ఉగ్రవాదులు హతం.. ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌తొయిబా ఉగ్రవాదాలను మట్టుబెట్టిన భారత ఆర్మీ..
-
భారత్ దాడుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాది హతం..
భారత్ దాడుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాది హతం.. ఆర్మీ దాడుల్లో లష్కరే తొయిబా కీలక ఉగ్రవాది అబూ జిందాల్ మృతి
-
ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..
ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్.. పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, అజిత్‌దోవల్, సీడీఎస్ అనీల్, త్రివిధ దళాధిపతులు.. ఆపరేషన్ సిందూర్, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చ.. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివరణ.. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం
-
పాక్ కు ఐఎంఎఫ్ నిధులు విడుదల..
పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ నిధులు విడుదల.. 1 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసిన ఐఎంఎఫ్.. పాకిస్తాన్‌కు జమకానున్న రూ.8,500 కోట్ల నిధులు
-
ప్రధాని మోడీతో త్రివిధ దళాల భేటీ..
ప్రధాని మోడీతో త్రివిధ దళాల భేటీ.. ప్రధాని నివాసంలో త్రివిధ దళాలతో సమావేశమైన మోడీ.. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరణ..
-
ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం: పాక్
పాకిస్థాన్ విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమన్న పాక్.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశాం: పాక్ విదేశాంగ మంత్రి
-
ఆపరేషన్ సింధూర్ వీడియోను విడుదల చేసిన ఆర్మీ..
ఆపరేషన్ సింధూర్ వీడియోను విడుదల చేసిన ఆర్మీ.. అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్.. టెర్రర్ క్యాంప్లను, లాంచ్ ప్యాడ్ల ధ్వంసం విజువల్స్.. సైనికుల విన్యాసాలను వీడియోలో పోస్ట్ చేసిన ఆర్మీ..
-
జైసల్మేర్ టార్గెట్ గా పాక్ దాడులు..
జైసల్మేర్ టార్గెట్ గా పాక్ దాడులు.. జైసల్మేర్ వ్యాప్తంగా ఉదయం నుంచే ఖాళీ చేయిస్తున్న పోలీసులు, ఆర్మీ.. జైసల్మేర్ కు 6 కి.మీ పరిధిలో ఉన్న గిడా గ్రామంలో మిస్సైల్స్ ను కూల్చిన భారత ఆర్మీ.. ప్రజలెవరు బయటకు రావొద్దని ఆదేశాలు.. జైసల్మేర్ ప్రధాన రహదారులను ఖాళీ చేయించిన భద్రతాదళాలు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని ఆదేశాలు.. ఖాళీ అవుతున్న జైసల్మేర్ ప్రధాన రహదారులు..
-
భారత్‌పై దాడుల్లో వ్యూహం మార్చిన పాక్..
భారత్‌పై దాడుల్లో వ్యూహం మార్చిన పాకిస్తాన్.. గత రెండు రోజులుగా రాత్రివేళ డ్రోన్లతో దాడి.. నేడు ఉదయం సమయంలోనూ కీలక ప్రాంతాలపై దాడులకు తెగబడ్డ పాక్.. సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత దళాలు
-
భారత బలగాలను రెచ్చగొడుతున్న పాకిస్తాన్..
ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో పాక్.. భారత బలగాలను రెచ్చగొడుతున్న పాకిస్తాన్.. సరిహద్దుల వెంట ముందుకు చొచ్చుకొస్తున్న పాక్ సైనికులు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం.. సమరానికి సన్నద్ధంగా ఉన్నర భారత సాయుధ బలగాలు
-
జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్..
జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్.. ఇరు దేశాలు సంయమనం పాటించాలి.. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని రుబియో సూచన.. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్‌తోనూ మాట్లాడిన మార్కో రుబియో
-
సామాన్య ప్రజలపై పాక్ కాల్పులు..
పాకిస్తాన్ ఈ రోజు ఉదయం కూడా దాడులు చేసింది.. పాక్ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది.. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగా జవాబు ఇస్తుంది: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
-
పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి వచ్చాయి..
పశ్చిమ సరిహద్దుల్లో మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది.. పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయి.. పంజాబ్ లోని పలు ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుంది.. శ్రీనగర్ స్కూల్లు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంది.. రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా టార్గెట్ చేసింది: వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్
-
పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇస్తున్నాం..
పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది.. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది.. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోంది.. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.. పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇస్తున్నాం: కల్నర్ సోఫియా ఖురేషి
-
పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొడుతున్న ఆకాశ్..
పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులను తిప్పికొడుతున్న బారత సైన్యం.. కౌంటర్ దాడులు చేయడంలో కీలకంగా మారిన ఆకాశ్ మిసైల్.. ఆకాశ్ క్షిపణికి ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా అడ్డుకునే కెపాసిటీ.. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ని ఛేదించే ఆకాశ్ మిసైల్.. 20 మిటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ క్షిపణి.. ప్రతి లాంచర్ లో మూడు క్షిపణులు.. ఒక్కొక్కటి 20 అడుగుల పొడువు, 710 కిలోల బరువు.. ఆటోమెటిక్, రియల్ టైమ్, మల్టి సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఫీచర్స్.. ఆకాశ్ ని తయారు చేసిన హైదరాబాద్ లని భారత్ డైనమిక్స్ లిమిటెడ్..
-
కాసేపట్లో ప్రధాని మోడీతో NSA అజిత్ దోవల్ భేటీ..
ఢిల్లీ కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్న NSA అజిత్ దోవల్.. తాజా పరిస్థితులపై ప్రధానికి వివరించనున్న దోవల్.. ఇంతకు ముందే త్రివిధ దళాలతో భేటీ అయిన అజిత్ దోవల్..
-
త్రివిధ దళాధిపతులతో అజిత్ దోవల్ భేటీ..
ఢిల్లీ: త్రివిధ దళాల అధిపతులతో NSA అజిత్ దోవల్ భేటీ.. తాజా పరిస్థితులపై కీలక చర్చ..
-
ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేత..
ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేత.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు.. బద్రినాత్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు.. హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు
-
పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్..
పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. కాల్పులు విరమించాలని పాక్ ను కోరిన అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో.. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలను కోరిన రుబియో..
-
భారత్ పై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై పాక్ ప్రధాని చర్చ..
భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ విలవిల.. ఇవాళ పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం.. కీలక సమావేశం నిర్వహించనున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై చర్చించనున్న షెహబాజ్..
-
మా సహనాన్ని భారత్ పరీక్షిస్తుంది: పాక్ డిప్యూటీ ప్రధాని
ఇండియన్ పవర్ గ్రిడ్ పై సైబర్ ఎటాక్ చేశాం.. బీఎస్ఎఫ్, బీజేపీ వెబ్ సైట్లను హ్యాక్ చేశాం.. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువ 1. 5 బిలియన్ డాలర్లు.. ఇండియన్ S-400 సిస్టమ్ ను దెబ్బ తీశాం మా మిస్సైల్స్ తో.. ప్రతీకార దాడులు తప్ప.. మాకు మరో దారి లేదు.. మా సహనాన్ని భారత్ పరీక్షిస్తుంది: పాక్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్
-
జనావాసాలే టార్గెట్‌గా పాక్ దాడులు..
LOC దగ్గర కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్.. జనావాసాలే టార్గెట్‌గా దాడులు.. జనావాసాలు, హిందూ దేవాలయాలపైనా దాడులు చేస్తోన్న పాక్.. కాశ్మీర్‌లోని శంభులో ఆలయంపై దాడులు.. పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం
-
పాక్ లో ఇందన కొరత..
పాకిస్తాన్ లో తీవ్ర ఇందర కొరత.. ఇస్లామాబాద్ లో 2 రోజులు పెట్రోల్ బంకుల మూసివేత..
-
ఈ యుద్ధాన్ని ఆపాలి..
పాక్ సైన్యం 6 లక్షలే.. భారత సైన్యం 16 లక్షల మంది.. అమెరికా, చైనా జోక్యం చేసుకుని ఈ యుద్ధం ఆపాలి: పాక్ రిటైర్డ్ కల్నల్
-
కచ్ లో పాక్ డ్రోన్లు కూల్చివేత..
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో మరో పాక్ డ్రోన్ కూల్చివేత.. పాక్ డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేస్తున్న భారత్..
-
పాక్ కాల్పుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మృతి..
రాజౌరి పట్టణంపై కాల్పులు జరిపిన పాక్.. కాల్పుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ మృతి..
-
లాండ్ ప్యాడ్స్ ను పేల్చేసిన భారత్..
పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తున్న లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా భారత్ దాడులు..
-
ఢిల్లీ టార్గెట్గా పాక్ మిస్సైళ్ల ప్రయోగం
ఢిల్లీ టార్గెట్గా పాక్ మిస్సైళ్ల ప్రయోగం.. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మిస్సైల్ కూల్చివేత..
శ్రీనగర్లో బ్లాక్ అవుట్ ప్రకటన.. శ్రీనగర్ కొద్ది సేపటి క్రితం రెండు పేలుళ్లు..
-
పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను కూల్చి వేసిన భారత్..
జమ్మూలో మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్.. కాల్పులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన జమ్మూకశ్మీర్.. భారత్ లోని 26 ప్రదేశాలను లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను కూల్చి వేసిన భారత్.. పాక్ ఫతే- మిస్సైల్ ను కూల్చివేసిన భారత్ ఆర్మీ.. జనవాసాలు టార్గెట్ గా దాడులు చేస్తున్న పాక్..
-
ఎయిర్ టు సర్ఫేస్ రేంజ్ మిస్సైల్స్ తో విరుచుకుపడ్డ భారత్
మూడు ఎయిర్ బేస్ లపై దాడులు జరిగినట్టు ప్రకటించిన పాక్ ఆర్మీ... రావల్పిండిలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు.. అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్.. ఎయిర్ టు సర్ఫేస్ రేంజ్ మిస్సైల్స్ తో విరుచుకుపడ్డ భారత్...
-
పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత...
భారత్ దాడితో పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత... అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్...
-
పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు...
పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలపై భారత్ దాడులు... రావాల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ లో పేలుళ్లు... నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో భారీ పేలుళ్లు.. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్ లపై భారత్ దాడి..
