Site icon NTV Telugu

Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు”: రాజ్‌నాథ్ సింగ్..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. గురువారం అన్ని రాజకీయ పార్టీలతో జరిగి ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతీదాడి ఉంటుందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అన్ని రాజకీయ పార్టీల నేతలకు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే, భద్రతా కారణాల వల్ల సున్నితమైన విషయాలను ప్రభుత్వం పంచుకోలేదని ఆల్ పార్టీ మీట్‌లో ఆయన చెప్పారు.

Read Also: Missile Attack : అమృతసర్‌ లక్ష్యంగా పాక్‌ మిస్సెల్‌ అటాక్‌.. తిప్పికొట్టిన భారత్‌..!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. మిస్సైల్స్‌ని ఉపయోగించి విధ్వంసం సృష్టించింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్, పీఓకే లోని 09 ప్రాంతాల్లో 24 స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలతో పాటు వాటి శిక్షణా శిబిరాలు, హ్యాండ్లింగ్ పాయింట్లను నాశనం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ దాడి చేస్తుందనే ఊహాగానాలు వెలువడటంతో, భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది.

Exit mobile version