Site icon NTV Telugu

Operation Sindoor: పాఠ్యాంశంగా ఆపరేషన్ సిందూర్.. సిలబస్‌గా చేర్చిన మదర్సాల

Operationsindoortextbooks

Operationsindoortextbooks

ఆపరేషన్ సిందూర్‌ను మదర్సాలలో పాఠ్యాంశంగా చేరుస్తామని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ షామూన్ ఖాస్మీ తెలిపారు. పిల్లలకు సైనిక ధైర్యం, జాతీయ ఐక్యతను నేర్పడానికి ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు 2025 నుంచి పాఠ్యాంశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను చేర్చనుందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముస్లిం బోర్డు సమావేశం అయిన తర్వాత బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్

ముస్లిం సమాజమంతా ప్రధాని మోడీతో ఉన్నామని.. ముస్లింల అభిప్రాయాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలియజేసినట్లు చెప్పారు. ఇక మదర్సాలలో చదువుతున్న పిల్లలకు ఆపరేషన్ సిందూర్ గురించి నేర్పిస్తామని తెలిపారు. పాకిస్థాన్.. మన అమాయక పౌరులను చంపిందన్నారు. దేశం ముఖ్యమైనది కాబట్టే.. ఆపరేషన్ సిందూర్‌ను సిలబస్‌లో చేరుస్తున్నట్లు చెప్పారు. విజయవంతమైన ఆపరేషన్ సిందూర్ గురించి పిల్లలకు నేర్పిస్తే.. మన సైనికుల శక్తి, ధైర్యం ఏంటో తెలుస్తుందన్నారు. పౌర ప్రాణనష్టం జరగకుండా ఎలా యుద్ధం చేయాలో భవిష్యత్ తరాలు అర్థం చేసుకుంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజాన్ని ప్రధాన స్రవంతి సమాజం నుంచి దూరం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో మదర్సాలు జాతీయ ఐక్యత మరియు అవగాహనకు దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: Shoyu : నాగ చైత‌న్య రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక.. పోస్ట్ వైర‌ల్

ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు చట్టం 2016 ప్రకారం.. మదర్సాలకు సిలబస్‌ను నిర్ణయించడం, పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం, బోధనా సామగ్రిని సిద్ధం చేసే అధికారం బోర్డుకు ఉంది. గతంలో రామాయణం మరియు మహాభారతం వంటి సంస్కృత మరియు హిందూ ఇతిహాసాలను మదర్సా విద్యలో ప్రవేశపెట్టే ప్రణాళికలను ఖాస్మీ ప్రకటించారు. అయితే ఈ మార్పులు ఇంకా అమలు చేయలేదు.

Exit mobile version