Site icon NTV Telugu

Operation Sindoor: రేపు లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ.. అధికార- విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ..

Lok Sabha

Lok Sabha

Operation Sindoor: లోక్‌సభలో రేపటి (జూలై 28న) నుంచి ఆపరేషన్‌ సింధూర్‌ పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. లోక్‌సభలో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. అయితే, ఈ చర్చను లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించనున్నారు.

Read Also: PM Modi: ఆగస్టు 23 వరకు మీ సలహాలు, సూచనలు పంపండి..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

అయితే, రాజ్యసభలో కూడా ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ జరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై చర్చ జరుపుతాని పేర్కొన్నారు. జూలై 29వ తేదీ నుంచి చర్చించనున్నట్లు తెలిపారు. రాజ్యసభలో కూడా చర్చకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానం ఇస్తారు. కాగా, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ఇప్పటికే విపక్షాల పట్టు పట్టాయి.. సీజ్ ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ ను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రేపు లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 22వ తేదీన జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు ఉగ్రవాదులు. దీంతో ఈ దాడికి ప్రతీకారంగా భారత్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.

Exit mobile version