Operation Sindoor: పాకిస్తాన్‌పై దాడికి ఇండియన్ నేవీ సిద్ధమైంది: అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి
- పాకిస్తాన్‌పై దాడికి ఇండియన్ నేవీ సిద్ధమైంది..
- ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాన్ని చెప్పిన నేవీ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని భారత నావికదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో ఇండియన్ నేవీ పాకిస్తాన్‌పై సముద్రం మార్గం ద్వారా దాడి చేసేందుకు అంతా సిద్ధమైంది, దాడికి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నామని చెప్పారు. అయితే, పాకిస్తాన్ దాడుల్ని నిలిపేయాలని అభ్యర్థించడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు.
Read Also: CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ముంబైలో జరిగిన నావికాదళ పురస్కార ప్రదానోత్సవంలో అడ్మిరల్ త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో విశేష సేవలు అందించినందుకు గాను ఇద్దరు సీనియర్ నావికాదళ అధికారులకు ఆయన యుద్ధ సేవా పతకాన్ని కూడా ప్రదానం చేశారు . గతేడాది మే6-7 తేదీల్లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే, పాక్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన స్థావరాలను నాశనం చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ పూర్తిగా అప్రమత్తతతో ఉందని, దాడికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఒక వేళ పరిస్థితి తీవ్రంగా మారి ఉంటే నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ కలిసి భారత్ అతిపెద్ద సైనిక చర్యను ప్రారంభించి ఉండేదని ఆయన మాటల్లో తెలుస్తోంది. మరోవైపు, పశ్చిమాసియా యుద్ధం గురించి అడ్మిరల్ త్రిపాఠి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో 20కి పైగా వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయని చెప్పారు. గతంలో ప్రతిరోజూ సుమారు 130 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 6-7కి పడిపోయిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!