Asaduddin Owaisi: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) త్వరలో అమలు చేయబోతున్నారు. అక్కడ పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ యూసీసీ అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే, దీనిపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ‘‘హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టాలకు మినహాయింపు ఇస్తునప్పుడు దీనిని యూనిఫాం సివిల్ కోడ్’’గా పిలువలేము అని అన్నారు.
Read Also: Nagashourya : క్యూట్ భాయ్ నాగశౌర్య కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసిందోచ్
యూసీసీ ద్వారా మీరు ముస్లింల వివాహాలు, విడాకులను మాత్రమే ఆపుతున్నారని ఆరోపించారు. హిందూ వారసత్వ చట్టాలను గిరిజనులకు వర్తింపచేయనప్పుడు ఇది ఎలా యూసీసీ అవుతుందని ప్రశ్నించారు. ఎవరైనా హిందూ మతనం నుంచి వేరే మతంలోకి మారాలనుకుంటే ఆ వ్యక్తి అనుమతి పొందాల్సి ఉంటుందని చెప్పారు. వక్ఫ్ నాశనం చేయాలని కేంద్రం ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల్ని దోచుకోవడానికి బిల్లు తీసుకువస్తున్నారని ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన జరిగినట్లే, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తామని హెచ్చరించారు.