NTV Telugu Site icon

Air Travel: విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..

Baggage Restrictions

Baggage Restrictions

Air Travel: విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని తీసుకువచ్చింది. ఇప్పుడు విమానాల్లో హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితుల్ని విధించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో ప్రయాణికులు విమానంలో ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను నిర్వహించడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని పంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ని తగ్గించడం ద్వారా కొత్త నిబంధనలు ప్రయాణికుల ప్రయాణాన్ని, ఎయిర్‌పోర్టు ఆపరేషనల్స్‌ని సులభతరం చేయనున్నాయి. BCAS,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ప్యాసింజర్స్ ఫ్లోని సులభతరం చేయడానికి కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించాయి.

కొత్త బ్యాగేజీ పరిమితులు:

1) ఒక హ్యాండ్ బ్యాగ్ పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ ప్రయాణికుడు 7 కిలోల కంటే ఎక్కువ బరువు లేని ఒక హ్యాండ్ బ్యాగ్‌ లేదా క్యాబిన్ బ్యాగ్‌ని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడుతాడు. మిగతా లగేజీలన్నీ చెక్ ఇన్ చేయాలి.

2) క్యాబిన్ బ్యాగ్ సైజు పరిమితులు: క్యాబిన్ బ్యాగ్ పరిమాణం 55 సెం.మీ ఎత్తు, 40 సెం.మీ పొడవు, 20 సెం.మీ వెడల్పు కంటే ఎక్కువ ఉండకూడదు.ఈ ఏకరూప నిబంధనలు అన్ని ఎయిర్ లైన్స్ ‌లో సెక్యూరిటీ స్క్రీనింగ్‌ని సులభతరం చేయడానికి ఉపయోగిపడుతాయి.

3) అదనపు బ్యాగేజీకి సర్‌ఛార్జ్: ప్రయాణికుడు క్యాబిన్ బ్యాగ్ బరువు లేదా పరిమణ పరిమితులను మించి ఉంటే, అప్పుడు అదనపు బ్యాగేజీ ఛార్జ్ ఉంటుంది.

4) ముందు టికెట్ కొనుగోలు చేసిన వారికి మినహాయింపు: 2 మే 2024కి ముందు జారీ చేయబడిన టిక్కెట్ ఈ లగేజీ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. గతంలో అమలైన క్యాబినె బ్యాగేజీ విధానం ఉంటుంది. (ఎకానమీ: 8 కిలోలు, ప్రీమియం ఎకానమీ: 10 కిలోలు, ఫస్ట్/బిజినెస్ క్లాస్: 12 కిలోలు). ఒకవేళ మళ్లీ టికెట్ ఇష్యూ చేయబడిని/రీ షెడ్యూల్ చేయబడిని టిక్కెట్లకు సవరించిన నిబంధనలు అప్లై అవుతాయి.

5) విమానయాన సంస్థలు, ప్రయాణికులపై ప్రభావం:
ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన క్యారియర్స్‌తో సహా విమానయాన సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగునంగా తన బ్యాగేజీ విధానాలను అప్డేట్ చేశాయి. చివరి నిమిషంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, అప్డేట్ అయిన బ్యాగేజీ రిక్వయిర్మెంట్‌ని చెక్ చేసుకోవాలని సూచించారు.

ఈ మార్పు విమానశ్రయ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తనఖీ కేంద్రాల వద్ద ఆలస్యాన్ని నివారించబద్చు. ప్రయాణికులు కొత్త నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా క్యాబిన్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.