Site icon NTV Telugu

బీఎస్పీకి కొత్త చీఫ్‌..! క్లారిటీ ఇచ్చిన మాయావతి

Mayawati

Mayawati

ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) ప్రముఖ పాత్రి పోషించింది.. ఇప్పటికీ కీలకంగా పనిచేస్తోంది.. అయితే, బీఎస్పీ అధినేత్రి త్వరలోనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ సాగుతోంది.. దీంతో మాయావతియే క్లారిటీ ఇచ్చారు.. బీఎస్పీకి కాబోయే చీఫ్‌ సతీష్ చంద్ర మిశ్రాయేనా అని మీడియా ప్రశ్నించగా.. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే బీఎస్పీ అధ్యక్షులు అవుతారని.. పార్టీకి, తనకు అన్ని సమయాల్లో అండగా ఉంటూ పార్టీని నడిపించే సమర్థులకే పగ్గాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది.. ఇలాంటి సమయంలో అధ్యక్ష స్థానం నుంచి నేను తప్పుకుని ఇంకొకరిని ప్రకటించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించిన మాయావతి.. నాకు ఆరోగ్యం సహకరించని సమయంలో కొత్త చీఫ్‌ వస్తారని.. అప్పుడే ఆ నేత ఎవరు? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఎస్పీ కాబోయే చీఫ్‌ ఎవరు అనేది ముందే చెబుతాం.. కానీ, నా ఆరోగ్యం సహరించినంత వరకు పార్టీ కోసం పని చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు మాయావతి.

Exit mobile version