Prajwal Revanna sex scandal: మాజీ ప్రధాని దేవెగౌడ్ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. దాదాపుగా 3000 వీడియోలు ఇటీవల వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ తన ఇంట్లో పనిచేసే మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ వీరిద్దరిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇప్పటికే కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి జర్మనీకి వెళ్లాడు.
ఇదిలా ఉంటే, రాజకీయంగా సంచలనంగా మారిన ఈ కేసులో జనాలు రేవణ్ణ వీడియోల కోసం తెగవెతుకుతున్నారు. ఆన్‌లైన్‌లో ఈ వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెక్స్ స్కాండల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్, ఎక్స్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఈ వీడియో గురించి సెర్చ్ చేస్తున్నారంటే, ఏకంగా భారతదేశ ఎన్నికలను కూడా ఇది అధిగమించడం గమనార్హం.
Read Also: AP Weather: రికార్డు స్థాయిలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
సెక్స్ స్కాండల్ గురించి వార్తలు జాతీయ ముఖ్యాంశంగా మారాడంతో ఏప్రిల్ 29 నుంచి వీడియోల కోసం సెర్చ్ చేయడం పెరిగింది. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం, ‘ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు’, ‘ప్రజ్వల్ రేవణ్ణ వీడియో’, ‘రేవన్న వీడియోలు’, ‘రేవణ్ణ సెక్స్’ అనేవి టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఈ పదాలు ఉపయోగించి జనాలు మొబైల్స్, కంప్యూటర్లలో గత వారం నుంచి సెర్చ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రజ్వల్ రేవన్న వీడియోలు పోర్న్’, ‘ప్రజ్వల్ రేవన్న xxx వీడియో’, ‘ప్రజ్వల్ రేవన్న వైరల్ వీడియోలు’, ‘ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ వీడియోలు’, ‘ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియో డౌన్‌లోడ్’, ‘ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోలు’ అంటూ భారీగా నెటిజన్లు సెర్చ్ చేశారు.
కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ నుంచి ఎక్కువ మంది ఈ అభ్యంతరకర వీడియోల గురించి సెర్చ్ చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ వీడియోస్’’ అనే పదం ఏకంగా ‘లోక్‌సభ ఎలక్షన్స్ 2024’ మించిపోయింది. గూగుల్‌లో, ప్రజలు ఏప్రిల్ 29 నుండి ప్రధాని మోదీ మరియు రాహుల్ గాంధీ ప్రసంగాలను వినడం కంటే రేవణ్ణ అభ్యంతరకరమైన వీడియోలను యాక్సెస్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.