ONGC: అరేబియా సముద్రంపై హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబయిలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో మొత్తం 9 మంది ఉండగా.. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, కాంట్రాక్టర్, ఇద్దరు పైలట్లతో వెళుతున్న హెలికాప్టర్ ఓఎన్‌జీసీకి చెందిన రిగ్ సాగర్ కిరణ్ సమీపంలో మంగళవారం నాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని కంపెనీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఫ్లోటర్ల సాయంతో సముద్రంపై ల్యాండ్ అయినట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. భారత తీర రక్షక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు నౌకలను సైట్ వైపు మళ్లించింది. హెలికాప్టర్ ఎందుకు ల్యాండ్ అయిందో ఇంతవరకు స్పష్టత రాలేదు.
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
డామన్ నుండి బయలుదేరిన ఒక డోర్నియర్ విమానం వారిని రక్షించేందుకు ఆ ప్రాంతంలో ఒక లైఫ్ తెప్పను పడవేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం ముంబైకి అరేబియా సముద్రంలో 7 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ అనేక రిగ్‌లను ఏర్పాటు చేసింది.
Six persons have been rescued so far. https://t.co/iBVPTkgDJQ
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!