COVID 19: కొత్త వేరియంట్ కలకలం.. భారత్‌లో తొలి కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.. భారత్‌లో మరి కొత్త వేరియంట్ కేసు నమోదు అయ్యింది.. కోవిడ్ ఎక్స్‌ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు భారత్‌లో వెలుగుచూసినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీవోజీ), సార్స్ సీవోవీ2 వైరస్‌కు చెందిన బులిటెన్‌ను విడుదల చేసింది.. అయితే, భారత్‌లో నమోదైన తొలి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు ఎక్కడ వెలుగు చూసింది అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, గత వారంతో పోలిస్తే, 12 రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తుండగా.. 19 రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గాయి..
మరోవైపు, అనుమానిత రీకాంబినెంట్ స్వీక్వెన్సింగ్‌కు సంబంధించిన తదుపరి విశ్లేషణలో ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు.. BA.2.10, BA.2.12 , BA.2 సబ్ లీనియేజ్‌లను డిటెక్ట్ చేశామని, అయితే వాటి వ్యాధి తీవ్రత గుర్తించలేదని బులిటెన్‌లో తెలిపారు. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్‌ఈ క్లస్టర్ నివేదికలు లేవు.. ఏప్రిల్ 18 బులెటిన్‌లో, ఐఎన్ఎస్ఏసీవోజీ దేశంలో ఒక ఎక్స్‌ఈ వేరియంట్ కేసును ప్రస్తావించింది. కానీ, ఇప్పుడు నిర్ధారణ జరిగింది. ఇక, అప్రమత్తమైన ప్రభుత్వం.. ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల నుండి నమూనాలను సేకరించడం ద్వారా దేశవ్యాప్తంగా ఎస్‌ఏఆర్‌ఎస్-CoV-2 యొక్క జన్యుపరమైన నిఘాను నివేదిస్తుంది. తాజా, బులెటిన్ ప్రకారం, INSACOG మొత్తం 2,43,957 నమూనాలను పరిశీలించింది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!