Site icon NTV Telugu

ఓనం ఎఫెక్ట్‌: ప్రతి వంద మందిలో 18 మందికి క‌రోనా…

దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.  సెకండ్ వేవ్ త‌గ్గిపోతుంద‌ని అనుకున్నా ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  ప్ర‌తిరోజూ వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక కేర‌ళ‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది.  కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, 200 వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  ఓనం ఫెస్టివ‌ల్ త‌రువాత ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  గురువారం రోజున 30,007 కేసులు న‌మోద‌య్యాయి.  ప్ర‌స్తుతం కేర‌ళ‌లో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది.  క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ప్ర‌తీ వందమందిలో 18 మందికి పాజిటివ్ గా నిర్ధార‌ణ అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  దేశంలో క‌రోనా రెండో ద‌శ పీక్స్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో కేర‌ళ‌లో 20 నుంచి 30 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యేవి.  రెండో ద‌శ నుంచి కోలుకున్నామ‌ని చెబుతున్న స‌మ‌యంలో కూడా అదేవిధంగా కేసులు న‌మోద‌వుతుండడం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  

Read: కాబూల్ టెర్రర్‌: తృటిలో తప్పించుకున్న 160 మంది భారతీయులు…

Exit mobile version