Site icon NTV Telugu

Arvind Kejriwal: ఐటీ లేఆఫ్స్‌పై కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి

Arvind Kejriwal

Arvind Kejriwal

On Tech Layoffs, Arvind Kejriwal’s Appeal To Centre: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యం కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే పలు టెక్‌ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించి కేంద్రం చర్యలు తీసుకోవాలని సోమవారం ట్విట్టర్ ద్వారా కోరారు. ఐటీ రంగం నుంచి యువకులు పెద్ద ఎత్తున తీసివేయబడ్డారని.. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి సరైన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Read Also: Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..

ఇటీవల కాలంలో పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2022లో ట్విట్టర్ తో మొదలైన తొలగింపుల ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతోంది. గతవారం గూగుల్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు మెటా 11 వేలమందిని, అమెజాన్ 18 వేల మందిని తొలగించింది. ఈ తొలగింపుల్లో భారతీయులు కూడా ఉద్యోగాలను కోల్పోతున్నారు. దేశీయంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగాల లేఆఫ్స్ ప్రకటించకున్నా.. త్వరలోనే ఇక్కడ కూడా తొలగింపులు ప్రారంభం అవుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version