Site icon NTV Telugu

Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ‘‘చైనా రాజ్యాంగాన్ని’’ ప్రదర్శిస్తున్నాడు.. రెడ్ బుక్‌పై అస్సాం సీఎం కామెంట్స్..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ఎరుపు రంగు రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై హిమంత శర్మ మాట్లాడుతూ.. ఆయన ఎన్నికల ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ నీలి రంగులో ఉంది. నిజమైన చైనా రాజ్యాంగానికి ఎరుపు రంగు ఉంటుంది. రాహుల్ చైనా రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాడా..? మేము ధ్రువీకరించాల్సి ఉంటుంది’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.

Read Also: PM Modi: దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.. పాకిస్తాన్ చేతిలో “బాంబు”లకు బదులు “భిక్షాటన గిన్నె” ఉంది..

‘‘రాహుల్ గాంధీ తన సమావేశాలకు హాజరవుతున్న సమయంలో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నాడు, మన రాజ్యాంగం బ్లూ కలర్‌లో ఉంటుంది, రాజ్యాంగ నిర్దేశిక సూత్రాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీఏ) ఉంది. దానిని అమలు చేయడం మన పవిత్ర విధి. అయితే రాహుల్ గాంధీ దీనిని వ్యతిరేకిస్తున్నాడు. అందకే ఆయ చేతిలో ఉన్న రాజ్యాంగం తప్పనిసరిగా చైనాదే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు హిమంత బిశ్వ శర్మ ధరించిన ఎరుపు కండువాను ఎత్తి చూపారు. రాజ్యాంగానికి రంగు లేదని, సీఎం ఎరుపు రంగు ఖండువా ధరిస్తారు, అది కూడా చైనాదేనా, ఇది సరైంది కాదు అని ఎమ్మెల్యే హఫీజ్ రఫీకుల్ ఇస్లాం అన్నారు. రాజ్యాంగంలో అనేక రంగులు ఉన్నాయి, కానీ లోపల ఉన్న విషయాలు ఒకేలా ఉంటాయని, మనం రంగును చదవం, లోపల ఉన్నదాన్ని మాత్రమే చదువుతాం, రంగు ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రషీద్ మోండల్ అన్నారు.

Exit mobile version