Site icon NTV Telugu

Omicron: ఫోర్త్‌ వేవ్‌ వస్తోందా.. ఢిల్లీలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ కలకలం!

Omicron

Omicron

Omicron: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండగా.. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు రోజుకు వేలల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యం అక్కడ ప్రజలు వైద్యం కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 90 నమూనాల అధ్యయన నివేదికలో కొత్త సబ్-వేరియంట్ బీఏ-2.75గా గుర్తించబడింది. కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన ఉపవేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించినట్లు మెడికల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా.సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

Nupur Sharma: నుపుర్‌శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసులన్నీ ఢిల్లీ కోర్టుకు బదిలీ

ఇంతకు ముందు ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్‌వేరియెంట్‌ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఈ వేరియంట్ యాంటీ బాడీలు న్నవారిలోనూ, టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డా.సురేశ్‌ పేర్కొన్నారు.వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో మంగళవారం 2,445 కరోనా కేసులు వెలుగుచూశాయి. గత ఫిబ్రవరి నుంచి దిల్లీలో ఇవే అత్యధిక కేసులు. దీంతో పాజిటివిటీ రేటు 15.41శాతానికి చేరింది. వైరస్‌తో ఏడుగురు మృతిచెందారు. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది.

Exit mobile version