NTV Telugu Site icon

విజృంభిస్తోన్న ఒమిక్రాన్‌.. ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కేసులు

గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ పలు దేశాలకు వ్యాపించగా అక్కడ పలు ఆంక్షలు విధించారు. కొన్ని దేశాల్లో విమాన రాకపోకలపై నిబంధనలు పాటిస్తున్నారు. అయితే రోజురోజుకు ఒమిక్రాన్‌ విజృంభన పెరిగిపోతుండడంతో తాజాగా యూకేలో ఒక్కరోజే 15,363 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళన చెందుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకు 60,508, డెన్మార్క్‌లో 26,362, నార్వేలో 3,871, కెనడాలో 2,294, యూఎస్‌లో 1,485, సౌతాఫ్రికాలో 1,444, జర్మనీలో 1,052 కేసులు, ఉండగా ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వేరియంట్‌ ఇక్కడ కూడా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200కు చేరుకుంది. ఒమిక్రాన్‌తో ఇప్పటి వరకు 15 మంది మృతిచెందారు.