Site icon NTV Telugu

Rahul gandhi: రాహుల్‌గాంధీని కలిసిన ఒలింపిక్ విజేత మను భాకర్

Medalistmanubhaker

Medalistmanubhaker

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఒలింపిక్ విజేత మను భాకర్ కలిశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. పారిస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది.

పారిస్ నుంచి రాగానే మను భాకర్.. సోనియాగాంధీని కలిశారు. ఆమె సాధించిన రెండు పతకాలను చూపించారు. అలాగే పారిస్ విశేషాలను కూడా సోనియాతో మను భాకర్ పంచుకున్నారు. అనంతరం ఆమె పలువురు కేంద్రమంత్రులను, కాంగ్రెస్ నేతలను కలిశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం పార్లమెంట్‌ హౌస్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీనే స్వయంగా ఆమెకు పూలబొకేతో ఆహ్వానించి స్వీట్ అందించారు. ఈ సందర్భంగా పారిస్ విశేషాలను పంచుకున్నారు. అనంతరం అందరితో కలిసి రాహుల్ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version