Site icon NTV Telugu

Case Filed On Ola & Rapido: ఆ నగరంలో ఓలా, రాపిడోలకు నో ఎంట్రీ.. డైరెక్టర్లపై కేసు నమోదు

Ola

Ola

Case Filed On Ola & Rapido: ముంబైలో బైక్‌- టాక్సీ సేవలకు అనుమతులు లేకుండా నిర్వహించారని ఆరోపిస్తూ ఓలా- ర్యాపిడో సంస్థల డైరెక్టర్లపై పోలీసులు FIR నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (RTA) అనుమతి లేకుండానే ఈ రెండు సంస్థలు మొబైల్‌ యాప్‌ల ద్వారా బైక్‌- టాక్సీ సేవలను అందిస్తున్నాయని RTO ఫిర్యాదుతో అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే, ఓలా- ర్యాపిడో పర్మిషన్స్ తీసుకోకుండా ప్రయాణికుల రవాణాను సులభతరం చేసి, అక్రమంగా లాభాలు పొందుతున్నట్టు ఆరోపించారు.

Read Also: Sangareddy: అర్ధరాత్రి గొడవ.. తెల్లారే శవం..! కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద మృతి!

ఇక, ర్యాపిడో, ఓలా సంస్థలు 2020 మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ అండ్ మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 66ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్‌ చెక్ చేయకపోవడం వల్ల ప్రయాణికుల భద్రతకు, ముఖ్యంగా మహిళల సెఫ్టీకి ప్రమాదమని ఆర్టీవో కంప్లైంట్ లో తెలిపారు. అలాగే, డ్రైవర్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలు ప్రయాణికుల భద్రతను సవాల్‌ చేస్తున్నాయని పోలీసులు అన్నారు. ఈ నేపథ్యంలో అంబోలీ పోలీసులు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ 1988లోని 198, 193, 197, 192(A), 93, 66 సెక్షన్లతో పాటు BNS 123, 318(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version