NTV Telugu Site icon

Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..

Odisha Train Accident 2

Odisha Train Accident 2

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. బాలాసోర్ లో జరిగిన రైలు దుర్ఘటనలో 275 మంది మరణించారు. అశ్విని వైష్ణవ్ దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతుల పనులు, రైళ్ల పునరుద్దరన గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తప్పిపోయిన ప్రయాణికులను వారి కుటుంబాలతో కలపడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తులను వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం మా లక్ష్యం అని, మా బాధ్యత ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు వందేభారత్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాద స్థలం నుంచి వెళ్తున్నాయి. అయితే నియంత్రిత వేగంతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Russia-Ukraine War: యుద్ధంలో 500మంది పిల్లలను చంపిన రష్యా

శుక్రవారం సాయంత్ర 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలోని బహనాగబజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలోనే మరో ట్రాక్ పై యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రావడం, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఎగిరి వచ్చి యశ్వంత్ పూర్ రైలు వెళ్తున్న ట్రాక్ పై పడటంతో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టిన సంఘటన జరిగింది. రైల్వే చరిత్రలో మూడు దశాబ్ధాల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. ఈ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.