Site icon NTV Telugu

Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్‌‌ఎస్‌ఈ, ఎల్‌ఐసీ బాసట.. పరహారం ప్రకటన

Nselic

Nselic

పహల్గామ్ మృతుల కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంఘీభావం తెలిపింది. దు:ఖ సమయంలో బాధితులకు అండగా నిలిచింది. ఉగ్రదాడి బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించింది. ఎన్‌‌ఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 26 మంది చనిపోవడం చాలా బాధ కలిగించిందని.. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు తమ వంతుగా రూ.1 కోటి సాయం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్‌‌ను వేగవంతంగా పూర్తి చేస్తామని ప్రకటించింది. సకాలంలో కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా సహకరిస్తామని వెల్లడించింది. కేవలం పహల్గామ్ ఉగ్ర దాడి పత్రాన్ని తీసుకొస్తే చాలు.. వెంటనే క్లెయిమ్ పూర్తి చేస్తామని ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా

 

Exit mobile version