Site icon NTV Telugu

NOTA Votes in UP: యూపీలో ఆ పార్టీలకంటే నోటా ఓట్లే ఎక్కువ

దేశవ్యాప్తంగా ఉత్కంఠ నింపాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో చూపిన వివరాల ప్రకారం.. యూపీ ఎన్నికల్లో నోటా 0.69 శాతం ఓట్లను పొందడం గమనించాల్సిన అంశం.

https://ntvtelugu.com/five-states-final-election-results-2022/

100 సీట్లలో పోటీచేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 0.47 శాతం ఓట్లు మాత్రమే పొందిందని ఈసీ తెలిపింది. ఆప్​ 0.35 శాతం, జేడీయూ 0.11, సీపీఐ 0.07శాతం, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్)​ ఎల్జేపీలు 0.01 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి 41.6 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన సమాజ్​వాదీ పార్టీ 32 శాతం ఓట్లు దక్కించుకుంది. వీటి తర్వాత బీఎస్పీకి 12.8శాతం, ఆర్​ఎల్​డీకి 3.02శాతం, కాంగ్రెస్​కు 3.02 ఓట్లు వచ్చాయి.

ఈసీ విడుదల చేసిన పార్టీల ఓట్ల శాతం పట్టిక

ఎగ్జిట్​పోల్స్​ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది. పంజాబ్‌లో ఆమ్​ఆద్మీ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. అక్కడ హేమాహేమీలను తన చీపురుతో ఊడ్చేశారు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి. పంజాబ్ లో అధికారాన్ని ఆప్ కి అప్పగించింది హస్తం.

Exit mobile version