China: భారత మీడియా తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వుని ఇంటర్వ్యూ చేయడాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తప్పుబడుతోంది. ఇది ‘వన్ చైనా’ విధానానికి విరుద్ధమని చెప్పింది. జోసెఫ్ వు తన ఇంటర్వ్యూలో ‘తైవాన్ స్వాతంత్ర్యం’ కోసం వాదించడానికి ఇండియా వేదిక కల్పించిందని భారత్ తోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. అయితే, చైనా వ్యాఖ్యలపై తైవాన్ ఘాటుగానే స్పందించింది. భారత్, చైనా స్వేచ్ఛాయుతమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యయుత మీడియా కలిగిన దేశాలని, చైనాకు భారత్ కానీ, తైవాన్ కానీ తోలుబొమ్మలు కావని చెప్పింది.
Read Also: Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యింది.. ఇదిగో సాక్ష్యం..?
ప్రస్తుతం భారత్ కూడా వన్ చైనా విధానాన్ని అనుసరిస్తోంది. నేరుగా తైవాన్‌తో భారత్‌కి దౌత్య సంబంధాలు లేవు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ‘వన్ చైనా’ సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘించారని, ఇది ఆమోదయోగ్యం కాదని చైనా తన అక్కసు వెళ్లగక్కింది. ఫిబ్రవరి 29,2024న కొన్ని భారతీయ టీవలు తైవాన్ విదేశాంగ కార్యాలయ అధిపతి జోసెఫ్ వుని ఇంటర్వ్యూ చేశాయని, ఇది అతనికి తైవాన్ స్వాతంత్ర్యాన్ని సమర్థించడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వేదికనను అందించిందని చైనా తన ప్రకటనలో పేర్కొంది.
గత కొన్ని రోజులుగా చైనా-తైవాన్ మధ్య ఘర్షణ నెలకొంది. వన్ చైనా విధానంలో చైనాతో పాటు తైవాన్, హాంకాంగ్ భాగాలని చైనా ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇటీవల కాలంలో తైవాన్ వ్యాప్తంగా స్వాతంత్ర్య భావాలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవల జరిగిన తైవాన్ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేయాలని చైనా భావించినప్పటికీ.. ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉన్న, చైనాను వ్యతిరేకించే పార్టీకే అక్కడి ప్రజలు జై కొట్టారు. ఈ నేపథ్యంలో చైనా తన మిలిటరీని ఉపయోగించి తైవాన్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది.
