Site icon NTV Telugu

Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..

Finland

Finland

Finland: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు.

Read Also: OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..

బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. స్టబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం యూరోపియన్ యూనియన్, అమెరికాకు సన్నిహిత మిత్రదేశం అని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. దాని జనాభా, దాని ఆర్థిక వ్యవస్థ దానికి కారణం. వెస్ట్రన్ దేశాలు భారత్‌తో సన్నిహితంగా మెలగడం చాలా ముఖ్యం’’ అని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ముందుగా కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతే జెలెన్స్కీ, పుతిన్ మధ్య సమావేశం, శాంతి చర్చలు ప్రారంభించగలమని స్టబ్ పేర్కొన్నారు.

Exit mobile version