NTV Telugu Site icon

Rudraprayag: గ్రామాల్లోకి హిందువులు కాని వారికి, రోహింగ్యా ముస్లింలకు ప్రవేశం నిషేధం..

Rudraprayag

Rudraprayag

Rudraprayag: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పలు గ్రామాల్లో హిందువులు కానివారి ప్రవేశాన్ని నిషేధిస్తూ పోస్టర్లు వెలిశాయి. నాన్-హిందువులు, రోహింగ్యా ముస్లింల ప్రవేశాన్ని నిషేధించారు. గత వారం చమోలిలో లైంగిక వేధింపుల కేసు తర్వాత ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఓ వర్గంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేంత వరకు రుద్రప్రయాగలో ఉద్రిక్తలు తగ్గలేదు. ప్రస్తుతం ముస్లిం వ్యాపారులను గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ హెచ్చరిస్తున్న పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టర్లపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఉత్తరాఖండ్ పోలీస్ అధికార ప్రతినిధి దినేష్ భర్నే రుద్రప్రయాగ్‌లో ఇలాంటి పోస్టర్లను ధృవీకరించారు. పరిస్థితిని అదపులోకి తెచ్చేందుకు స్థానికులతో పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు బయటి వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!

పోస్టర్లు ఎందుకు వెలిశాయి..?

రుద్రప్రయాగ్ జిల్లాలో, సోన్ ప్రయాగ్ గ్రామంలోకి ‘‘హిందువులు కాని వారు, రోహింగ్యాలు గ్రామంలోకి ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాము’’ అనే బోర్డు వెలుగులోకి వచ్చాయి. గత వారం చమోలీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది.

రుద్రప్రయాగ్‌లోని సిర్సి గ్రామాని చెందిన అశోక్ సెమ్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గ్రామస్తులు పనుల కోసం బయటకు వెళ్తున్న క్రమంలో, ఇంట్లో ఉన్న మహిళలు ఒంటరిగా ఉంటున్నారని, ఇది సంఘటన ప్రమాదాన్ని పెంచుతోందని చెప్పారు. గతంలో జరిగి ఆలయం చోరీని ఉటంకిస్తూ, గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి రాకుండా పోస్టర్లు అంటించామని చెప్పారు.

ఎంఐఎం, కాంగ్రెస్ నిరసన:

ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నయ్యర్ కజ్మీ ఉత్తరాఖండ్ డీజీపీని కలిశారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల వివాదం తర్వత ముస్లిం ఇళ్లపై దాడి చేసి లూటీ చేశారని, చాలా మంది పారిపోయేలా చేశారని కజ్మీ ఆరోపించారు. వారం రోజుల్లో చర్యలు చేపట్టకపోతే అసదుద్దీన్ ఓవైసీ మార్గదర్శకత్వంలో నిరసన చేపడుతామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని మాత్రమే నేరస్తులుగా పరిగణించాలని, మొత్తం ఓ సమాజాన్ని శిక్షించరానిన కాంగ్రెస్ నేత గణేష్ గోడియాల్ అన్నారు.