Wrestlers Protest: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రెజ్లర్ సాక్షిమాలిక్, తన భర్త సత్యవర్త్ కడియన్ తో కలిసి మాట్లాడుతూ.. ఈ కేసులో మైనర్ రెజ్లర్ బాలిక తండ్రికి బెదిరింపులు రావడంతోనే భయపడి తన స్టేట్మెంట్ ను మార్చుకున్నారని ఆరోపించారు.
Read Also: Bengaluru: 25 మంది ఆఫ్రికా జాతీయుల అరెస్ట్.. డ్రగ్స్ వ్యతిరేక కేసులు నమోదు..
అయితే తన కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు రాలేదని మైనర్ రెజ్లర్ తండ్రి వెల్లడించారు. మేము చేయవల్సింది చేశామని, మా కుటుంబానికి వ్యతిరేకంగా బెదిరింపులు వచ్చాయనే వాదనల్లో నిజం లేదని ఆయన అన్నారు. అంతకుముందు సాక్షి మాలిక్ వీడియోలో మాట్లాడుతూ..మైనర్ రెజ్లర్ రెండు సార్లు తన స్టేట్మెంట్ అందించారని, మొదటగా ఐపీసీ సెక్షన్ 161 కింద పోలీసులకు, సెక్షన్ 164 కింద కోర్టుకు వాంగ్మూలం ఇచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబానికి బెదిరింపులు రావడంతోనే ఇలా వాంగ్మూలాన్ని మార్చి ఇచ్చారని సాక్షి మాలిక్ ఆరోపించారు.
మైనర్ రెజ్లర్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దృఢమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని ఢిల్లీ పోలీసులు వాదించిన తర్వాత సాక్షిమాలిక్ ఈ వ్యాఖ్యు చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసు రద్దు నివేదికను జూలై 4న ఢిల్లీకోర్టు పరిశీలించనుంది. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్లు రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడుగురు రెజ్లర్లపై అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటామని హామీ రావడంతోనే రెజ్లర్లు తమ నిరసనను నిలిపేశారు.
https://twitter.com/SakshiMalik/status/1670008378725220352
