NTV Telugu Site icon

Anju Father: అంజూతో తమకు ఇకపై ఎలాంటి బంధుత్వం లేదు: తండ్రి గయా ప్రసాద్‌ థామస్

Anju Father

Anju Father

Anju Father: పాకిస్తాన్‌ వెళ్లి తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజూతో ఇకపై తమకు ఎలాంటి బంధుత్వం లేదని ఆమె తండ్రి గయా ప్రసాద్‌ థామస్ చెప్పారు. పాక్‌ వెళ్లి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ నస్రుల్లాను పెళ్ళాడిన అంజు చర్యల పట్ల ఆమె తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె తిరిగి భారత్‌కు రావడానికి హక్కు లేదన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని పేర్కొన్నారు.

Read also: Heavy Floods: మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం

రాజస్థాన్‌కు చెందిన వివాహిత మహిళ అంజూ… ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్‌బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్‌.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తమ కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. ఇది చాలా విచారకరమైన విషయమని అన్నారు.

Read also: Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..

అంజు అనే వివాహిత రాజస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్‌బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో బివాడీకి చెందిన అంజూకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజూ.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజూ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. ఆమె తమకు చెప్పకుండానే పాక్‌ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్‌ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.