NTV Telugu Site icon

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాపై కేంద్రం కీలక ప్రకటన

Kvs

Kvs

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీటు లభిస్తే.. ఉచితం విద్య లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో సీటు కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇందులో సీటు కోసం ఎంపీల సాయంతో లభించేది. అయితే ఈ విధానం కొద్ది రోజులగా బ్రేక్ పడింది.

ఇది కూడా చదవండి: Film Chamber: గద్దర్ అవార్డులపై సీఎం కామెంట్స్.. ఫిలిం ఛాంబర్ కీలక వ్యాఖ్యలు

తాజాగా రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్‌ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్‌ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఇది కూడా చదవండి: AP Budget: రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం

ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్‌ నిష్పత్తి భారీగా పెరిగిపోతుందని.. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనను ప్రస్తుతానికి కేంద్రం దగ్గర లేదు అని వెల్లడించారు. గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10 మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Delhi fire: ఢిల్లీలో దారుణం.. మహిళను కాల్చి చంపిన దుండగుడు

Show comments