NTV Telugu Site icon

PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని అన్నారు. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేసిన చేసింది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ విరుచుకుపడ్డారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో వారు రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ చేశారు. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ అంగీకరించడం లేదని, వారు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఇండియా కూటమి మనస్తత్వం’’ అని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు.

Read Also: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి..

కాంగ్రెస్, టీఎంసీ, ఇతర ఇండియా కూటమికి చెందిన పార్టీలు వారి ఓటు బ్యాంకుకు మద్దతు ఇస్తున్నాయని, అయితే మోడీ జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని మీకు భరోసా ఇస్తున్నానని మోడీ అన్నారు. ఇది రాజకీయ ప్రసంగం కాదని, అణగారిన వారి హక్కులకు తాను ఇచ్చే హామీ అని అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు దేశం కన్నా వారి ఓటుబ్యాంకు ముఖ్యమని, ఈ వ్యక్తులు తమ ఓటు బ్యాంకు కోసం దేశాన్ని విభజించారని, వారు ఇండియాను విభజించి రెండు ముస్లిం దేశాలను సృష్టించారని అన్నారు.

2010 తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను కలకత్తా హైకోర్టు బుధవారం రద్దు చేసింది. 1993 చట్టం ప్రకారం OBCల కొత్త జాబితాను సిద్ధం చేయాలని పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. దాదాపుగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు రద్దయ్యాయి. 2010 తర్వాత ఓబీసీ కోటా కింద ఉద్యోగాల్లో ఉన్నవారు, వాటిని పొందే ప్రక్రియలో ఉన్న వారు కోటా నుంచి మినహాయింపబడరు. వారి ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత, ఈ తీర్పును అంగీకరించబోమని సీఎం మమతా బెనర్జీ అన్నారు.