NTV Telugu Site icon

క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులే టార్గెట్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

children

క‌రోనా సెకండ్ వేవ్ ఇప్ప‌టికీ భార‌త్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు క్ర‌మంగా దిగివ‌స్తున్నా.. మృతుల సంఖ్య ఇంకా భారీగానే న‌మోదు అవుతోంది.. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ వేవ్‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.. ఇది ముఖ్యంగా చిన్నారుల‌ను టార్గెట్ చేస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. క్లారిటీ ఇచ్చింది. క‌రోనా వైర‌స్ మ్యుటేట్ కావ‌డం ద్వారా థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌నే సంకేతాలు ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డికాలేద‌ని.. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా సోకుతుందనే వాద‌న‌ల్లో వాస్త‌వం లేదంటోంది పీడియాట్రిక్స్ అసోసియేష‌న్. మ‌‌రోవైపు.. చిన్నారుల‌పై థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా. మొత్తంగా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా.. చిన్నారుల‌పై ప్ర‌భావం అంతంత మాత్ర‌మే అంటున్నారు.