NTV Telugu Site icon

Minister Manjinder Singh Sirsa: వాహనదారులకు ప్రభుత్వం షాక్.. ఈ వెహికల్స్ కు పెట్రోల్-డీజిల్ బంద్..?

Petrol

Petrol

బండి ముందుకు కదలాలంటే ఫ్యుయల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పెట్రోల్, డీజిల్ లేకపోతే వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోతాయి. మరి మీకు కూడా పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు ఉన్నాయా? అయితే మీకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ అందించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వెహికల్స్ కు అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ అందించబోమని స్పష్టం చేసింది. అయితే ఇది మనదగ్గర కాదండోయ్ ఢిల్లిలో. ఢిల్లీ ప్రభుత్వం శనివారం నాడు వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏవాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ కానుందంటే?

Also Read: KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో మార్చి 31 తర్వాత పెట్రోల్ పంపులలో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వబోమని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. మార్చి 31 తర్వాత నగరంలోని పెట్రోల్ బంకుల్లో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ సరఫరాను నిలిపివేస్తామని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం ప్రకటించారు. అంటే ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ లభించదు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల ఉద్గారాలు, కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని సిర్సా అన్నారు.

Also Read:Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ.. ఏకంగా 200 కి.మి రేంజ్!

పాత వాహనాలపై నిషేధం, పొగమంచు నిరోధక చర్యలు, ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాలను ఉపయోగించడం వంటి కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలిపారు. సమావేశం తర్వాత సిర్సా మాట్లాడుతూ, “15 సంవత్సరాల కంటే పాత వాహనాలను గుర్తించే గాడ్జెట్‌లను పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నాము, గుర్తించిన వెహికల్స్ కు ఇంధనం అందించబడదు” అని అన్నారు. ఈ నిర్ణయం గురించి ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుందని ఆయన అన్నారు.

Also Read:Re Shoot: 10 కోట్లు బూడిదలో పోయించిన పాన్ ఇండియా స్టార్

పాత వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేయడమే కాకుండా, వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి రాజధానిలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలలో యాంటీ-స్మోక్ గన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిర్సా తెలిపారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీలోని దాదాపు 90 శాతం ప్రభుత్వ CNG బస్సులను డిసెంబర్ 2025 నాటికి దశలవారీగా నిలిపివేసి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.