Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 21వ లా కమిషన్ పదవీకాలం 2018 ఆగస్టు 31తో ముగిసిందని.. లా కమిషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం, దీన్ని 22వ లా కమిషన్ పరిశీలనకు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. అందువల్ల యూనిఫా సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
Read Also: Anil Kumar Yadav: హీట్ పెంచిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్..
ప్రస్తుత లా ప్యానెల్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ప్యానెల్ పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ప్రస్తుత లా ప్యానెల్ ఫిబ్రవరి 21, 2020న ఏర్పాటైంది, అయితే దాని చైర్‌పర్సన్ మరియు సభ్యులు గత ఏడాది నవంబర్‌లో అంటే ప్యానెల్ పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల ముందు నియమించబడ్డారు. 21వ లా కమిషన్ యూనిఫా సివిల్ కోడ్ కు సంబంధించి వివిధ సమస్యలను పరిశీలించేదుకు, విస్తృత చర్చల కోసం తన వెబ్ సైట్ లో ‘‘ రిఫామ్ ఆఫ్ ఫ్యామిలీ లా’’ పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్ ను అప్‌లోడ్ చేసింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ యూనిఫా సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
