Adani Group: అదానీ గ్రూప్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీలు.. ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు (బుధవారం) రియాక్ట్ అయింది. ఇందులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై కేసు నమోదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గ్రీన్ ఎనర్టీ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి ( గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్)పై సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
Read Also: Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
కాగా, ఎఫ్‌సీపీఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్ ప్రస్తావన లేదని అదానీ గ్రూప్ పేర్కొనింది. యూఎస్‌లో గౌతమ్ అదానీపై కేసులు నమోదు అయినట్లు ఆరోపణలు రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వచ్చాయి. అలాగే తెలంగాణలో ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.