NTV Telugu Site icon

Pinarayi Vijayan: వయనాడ్ బాధితులకు కేంద్రం ఇప్పటి వరకు సాయమే చేయలేదు

Pinarayivijayan

Pinarayivijayan

కేంద్రం తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేంద్రం సాయం చేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతేడాది వయనాడ్‌లో ప్రకృతి విలయం కారణంగా కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోడీ వయనాడ్‌ను సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై సీఎం విజయన్ గుర్తుచేశారు. వయనాడ్ బాధితుల కోసం కేంద్రం చేస్తానన్న సాయం ఇప్పటివరకు అందలేదని తెలిపారు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ.2,221 కోట్లు డిమాండ్ చేసిందని.. అయినా ఇంకా ఎక్కువ నిధులు అవసరమని చెప్పారు. వయనాడ్ విపత్తును కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించింది.

ఇది కూాడా చదవండి: Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష..

గత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వయనాడ్ బాధితులకు సాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేరళ ఎంపీలతో అమిత్ షాను కలిసి లేఖ అందజేశారు. అంతేకాకుండా వయనాడ్ విలయం తర్వాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంకాగాంధీ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఇది కూాడా చదవండి: A-THON Ashva: వ్యవసాయం కోసం ప్రత్యేక కారు.. పొలాలైనా, పర్వతాలైనా ఇట్టె ఎక్కేస్తుంది! ధర ఎంతంటే?