Bihar: ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా
- ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా
- ఏప్రిల్ 10 రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం
- ఇక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజీనామా చేశారు. ఇటీవలే ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇరువురు పదవులకు రాజీనామా చేశారు. నితిన్ నవీన్ రాజీనామాను బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ ఆమోదించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
స్పీకర్‌కు నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించారని జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ చౌదరి ధృవీకరించారు. ఇక స్పీకర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మార్చి 16 నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువు ఉండడంతో ఈరోజు రాజీనామా చేశారు. ఇక రాజ్యసభలో ఏప్రిల్ 10న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ రాజకీయాలు మరింత అస్థిరంగా మారాయి. ఇప్పుడు రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. అధికార కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చలు ప్రారంభం కాగా.. రాజకీయ వర్గాల్లో పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి జేడీయూ స్థానంలో బీజేపీ రాబోతోంది. బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది ఎవరన్నది సస్పెన్ష్‌గా ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?