NTV Telugu Site icon

BJP 2nd List: నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఖట్టర్.. బీజేపీ రెండో లిస్టులో ఉన్న కీలక నేతలు వీరే..

Bjp

Bjp

BJP 2nd List: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో జాబితాను ప్రకటించింది. గతవారం 195 మందితో తొలిజాబితా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బుధవారం 72 మందితో రెండో జాబితాను ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Read Also: Aamir Khan: ఆమెతో శృంగారం.. అందుకే విడాకులు.. మాజీ భార్య కీలక వ్యాఖ్యలు

ఈ జాబితాలో పలువురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. నితిన్ గడ్కరీకి ఈ సారి బీజేపీ సీటు ఇవ్వదని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఆర్ఎస్ఎస్ కంచుకోట నాగ్‌పూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు. గడ్కరీ బీజేపీలో అవమానాలు ఎదుర్కొంటే మా కూటమిలో చేరాలని ఉద్ధవ్ ఠాక్రే అడిగారు. అయితే ఠాక్రే ఆఫర్ అపరిపక్వమైనది, హాస్యాస్పదమైనదిగా గడ్కరీ కొట్టిపారేశారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలేపై గడ్కరీ గెలుపొందారు. 2014, 2019లో నాగ్‌పూర్ నుంచి గడ్కరీ వరసగా విజయం సాధించారు.

ఒక రోజు క్రితం హర్యానా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన మనోహర్ లాల్ కట్టర్ కర్నాల్ ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ముంబై నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హమీర్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై హవేరి నుంచి, తేజస్వీ సూర్య బెంగళూర్ సౌత్ నుంచి, ధార్వాడ్ నుంచి ప్రహ్లద్ జోషి పోటీలో ఉన్నారు.

రెండో లిస్టులో ఉన్న కీలక నేతలు వీరే:

మనోహర్ లాల్ కట్టర్- కర్నాల్(హర్యానా)

అనురాగ్ సింగ్ ఠాకూర్-హమీర్‌పూర్(హిమాచల్ ప్రదేశ్)

శ్రీరాములు-బళ్లారి(కర్ణాటక)

బస్వరాజ్ బొమ్మై-హవేరి(కర్ణాటక)

ప్రహ్లాద్ జోషి-ధార్వాడ్(కర్ణాటక)

బీవై రాఘవేంద్ర-శిమోగా(కర్ణాటక)

తేజస్వీ సూర్య-బెంగళూర్ సౌత్

నితిన్ గడ్కరీ-నాగ్‌పూర్(మహారాష్ట్ర)

పియూష్ గోయెల్-ముంబై నార్త్

పంకజా ముండే-బీడ్(మహారాష్ట్ర)

రఘునందన్ రావు-మెదక్(తెలంగాణ)

మహబూబ్ నగర్-డీకే అరుణ( తెలంగాణ)